Nov 09,2023 08:45

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమీర్‌ఖాన్‌ కుమార్తె ఐరా ఖాన్‌, నుపుర్‌ వివాహం జనవరి 3న జరగనుంది. ప్రీ వెడ్డింగ్‌ వేడుకలను నిర్వహించారు. కాబోయే వధూవరుల కుటుంబాలు ఒకేచోట కలిసి కెల్వన్‌ కార్యక్రమం నిర్వహించాయి. దీనికి సంబంధించిన ఫొటోలను ఐరా తాజాగా ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. ఇందులో వధూవరులిద్దరూ సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. మహారాష్ట్ర సంప్రదాయం ప్రకారం పెళ్లి పనులు కెల్వన్‌తో మొదలవుతాయి. ఇరు కుటుంబసభ్యులు విందు భోజనాలు ఏర్పాటు చేసి, కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు.