- ఎస్ వెంకట్రావు, జి ఆంజనేయులు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్‌లను ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేసిన రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీల్లో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (ఎపిడబ్ల్యుజెఎఫ్)కు ప్రాతినిధ్యం కల్పించాలని ఆ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్ వెంకట్రావ్, జి ఆంజనేయులు డిమాండ్ చేశారు. జర్నలిస్టు సమస్యలపై నిరంతరం పనిచేస్తూ.. వేలాది మంది సభ్యులతో అన్ని జిల్లాల్లో కమిటీలను కలిగి వున్న ఎపిడబ్ల్యుజెఎఫ్ రాష్ట్రంలో పెద్ద సంఘంగా ఉందని తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత అక్రడిటేషన్ కమిటీలతోపాటు ప్రభుత్వ పరంగా వుండే అన్ని కమిటీలలో ఎపిడబ్ల్యుజెఎఫ్‌కు ప్రాతినిధ్యం వుండేదని తెలిపారు. జర్నలిస్టుల సమస్యలపై పని చేసే సంఘాలను కొత్తగా ఈ ప్రభుత్వం విడుదల చేసిన జిఓలలో విస్మరించడం తగదని పేర్కొన్నారు. తక్షణమే అక్రిడిటేషన్ కమిటీల ఏర్పాటు విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పునరాలోచన చేయాలని కోరారు.










