విజయవాడ: ఉండవల్లి కరకట్ట వద్ద ఉన్న లింగమనేని రమేశ్ గెస్ట్ హౌస్ జప్తునకు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతించింది. తొలుత లింగమనేని రమేశ్‌కు నోటీసు ఇవ్వాలని ఆదేశించింది. ఉండవల్లి కరకట్ట వద్ద ఉన్న లింగమనేని రమేశ్ గెస్ట్‌హౌస్‌ను అటాచ్ చేయాలంటూ ప్రభుత్వం ఇటీవల జీవో విడుదల చేసింది. జప్తు చేసేందుకు అనుమతి కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఇరుపక్షాల వాదనలు విని ఈరోజు తుది తీర్పు వెలువరించింది. గెస్ట్ హౌస్ జప్తునకు సీఐడీ అధికారులకు అనుమతిచ్చింది.










