జి.కొండూరు (ఎన్‌టిఆర్) : రెండు బైక్‌లు ఢీకొట్టుకోవడంతో యువకుడి కాలు విరిగిన ఘటన మంగళవారం జి.కొండూరు బైపాస్ రోడ్డులోని అతుకూరులో జరిగింది. జి.కొండూరు ఎస్సీ హాస్టల్లో వార్డెన్ విధులు నిర్వహించేందుకు ఆతుకూరు వైపు నుండి జి కొండూరుకు వెళుతున్న వాహనదారుడు... గణపవరం నుండి విజయవాడ వైపు వెళుతున్న గణపవరంకి చెందిన నవీన్ (27) బైక్‌ను ఢీకొట్టాడు. జి.కొండూరు క్రాసింగ్ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. నవీన్ కాలు విరగడంతో వెంటనే విజయవాడ హాస్పిటల్‌కు తరలించారు. నాలుగు రోడ్ల క్రాసింగ్ వద్ద ఎలాంటి భద్రతా ఏర్పాట్లు లేకపోవడం వల్ల ఇలా ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు, వాహనచోదకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.










