Jul 29,2023 11:28

ప్రజాశక్తి-గండేపల్లి (కాకినాడ) : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన శనివారం గండేపల్లి మండలంలో జరిగింది. గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన జి.భరత్‌ ప్రేమ కిషోర్‌ మల్లేపల్లి నుండి గండేపల్లికి మోటార్‌ సైకిల్‌ పై వెళుతుండగా, వెనక నుండి లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో కిషోర్‌కి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న ఎఎస్‌ఐ చంద్రశేఖర్‌ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి వెళ్లి 108 సాయంతో రాజమండ్రి ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రికి చేరుకునేలోగే కిషోర్‌ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.