Mar 02,2023 16:28

ప్రజాశక్తి-కంచికచర్ల (ఎన్‌టిఆర్‌) : బాయిలర్‌లో పడి యువకుడి మతి చెందిన ఘటన కంచికచర్లలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. కంచికచర్ల మండలం పరిటాల సమీపంలోని న్యూ కాన్‌ బ్రిక్స్‌లో గ్రామానికి చెందిన పాలంకి హరికష్ణ సేల్స్‌ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. గురువారం బాయిలర్‌లో పేరుకుపోయిన సిమెంటును డ్రిల్లింగ్‌ మిషన్‌తో తొలగిస్తుండగా బాయిలర్‌లో పడి మృతి చెందాడు. మృతుడికి భార్య ముగ్గురు, ఆడపిల్లలు ఉన్నారు.