
తాడికొండ (గుంటూరు) : గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన ఆదివారం తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామ శివారులో జరిగింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతుడు తాడికొండ గ్రామానికి చెందిన బొబ్బిలి రాజకుమార్ గా గుర్తించారు. రాజ్ కుమార్ తన స్నేహితుడితో కలిసి పొన్నెకల్లు నుండి తాడికొండకు వస్తుండగా ఈ ఘటన జరిగింది. మరొకరికి గాయాలవ్వడంతో 108 లో జిజిహెచ్ కు స్థానికులు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.