Jun 13,2023 14:39

ప్రజాశక్తి-రేణిగుంట(తిరుపతి) :రేణిగుంట పరిధిలోని గురవరాజు పల్లి సర్కిల్‌ వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. వెంకటగిరి నుంచి తిరుపతి వైపు వస్తున్న ఆర్టిసి బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. మృతిని వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.