ప్రజాశక్తి-పెద్దాపురం(కాకినాడ) : కాకినాడ జిల్లా సామర్లకోట మండలం అచ్చంపేట నన్నయ్య యూనివర్సిటీ జోన్ -2 మీటింగ్‌కు వెళుతున్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు స్థానిక ఏడిబిరోడ్ ఆర్.బి పట్నం సెంటర్లో తెలుగు యువత నాయకులు ఘన స్వాగతం పలికారు. యూత్ నాయకులు పుష్పగుచ్చం అందజేయగా చంద్రబాబు నాయుడు ఉత్సాహంగా వారిని పలకరించారు. ఈ కార్యక్రమంలో ప్రసన్న, సానిపిని సురేష్, సుధీర్, నవీన్, పెంకె సుబ్రహ్మణ్యం, మన్యం ప్రసన్నకుమార్, పెనుమర్తి దొరబాబు తదితరులు పాల్గొన్నారు.










