Nov 09,2023 10:45

మనోహరాబాద్‌ (మెదక్‌) : స్కూటీని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తల్లీ ఇద్దరు పిల్లలు మృతి చెందిన ఘటన గురువారం మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం కల్లకల్‌ వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. మేడ్చల్‌ నుంచి తూప్రాన్‌ వైపు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న ఎస్సై కరుణాకర్‌ రెడ్డి ఘటనాస్థలానికి చేరుకున్నారు. మఅతుల వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.