Jun 01,2023 14:38

ప్రజాశక్తి - సామర్లకోట రూరల్‌ (కాకినాడ) : బాస్కెట్‌బాల్‌ గుడ్‌ ఫ్రెండ్స్‌ అసోసియేషన్‌ సామర్లకోట ప్రభుత్వ జూనియర్‌ కాలేజ్‌ గ్రౌండ్లో నిర్వహిస్తున్న సమ్మర్‌ క్యాంపు విజయవంతంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ప్రెండ్స్‌ వాకర్స్‌ క్లబ్‌ సభ్యులు విప్పర్తి కొండలరావు మాట్లాడుతూ 30రోజులు నుండి ఈ సమ్మర్‌ క్యాంపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతీ రోజూ క్యాంపులో 70 నుండి 80 మంది బాల బాలికలు పాల్గొంటున్నారని, పిల్లలకు మిలటరీ ఎక్స్‌ సర్వీస్‌ మెన్‌ పి.టి మాష్టర్‌ ఐ.గోపాలం, బాస్కెట్బాల్‌ సీనియర్‌ ప్లేయర్‌ చెక్కా శేషా రావు , ప్రజెంట్‌ ఇండియా ఆర్మీలో కోచ్‌గా పని చేస్తున్న బొడ్డు సత్యనారాయణలు క్రమ శిక్షణ నేర్పుతూ కోచింగ్‌ ఇస్తున్నారన్నారు. అలాగే క్యాంపులో పాల్గొన్న పిల్లలకు ప్రెండ్స్‌ వాకర్స్‌ క్లబ్‌ తరుపున రోజుకు ఒకరు చొప్పున అరటి పండు, కొడి గ్రుడ్డు, మజ్జిగ ఏర్పాటు చేసి దాతలకు ప్రెండ్స్‌ వాకర్స్‌ క్లబ్‌ తరుపున అభినందనలు తెలిపారు. ప్రతీ సంవత్సరం పిల్లలకు స్కూలు సెలవులు ఇవ్వగానే ఈ సమ్మర్‌ క్యాంపు నిర్వహించడం జరుగుతుందని, పిల్లలు టి.విలకు,సెల్‌ పోనులకు అతుక్కుపోకుండా ఈ క్యాంపులో పిల్లలు పాల్గొవడం ద్వారా మంచి ఆరోగ్యంతో పాటు బ్రెయిన్‌ కూడా మంచిగా షార్ప్‌గా భవిష్యత్తులో ఎదగడానికి సమ్మర్‌ క్యాంపు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ఈ క్యాంపులో విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన వారిలో ఎండీవీ ప్రసాద్‌ ,గిరి మాస్టారు , కెనడిలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు లింగం శివ, సైపుల్లా , అబ్బులు మాస్టర్‌ , పిల్లలకు సేవలు అందించిన వారిలో వాకర్స్‌ సభ్యులు బాలం సత్తిబాబు, కృష్ణ , టి. శ్రీనివాస్‌, విప్పర్తి కొండల రావు, వాకర్స్‌ సభ్యులు పాల్గొన్నారు.