Jan 08,2023 10:44

కాలరేఖపై
ఎప్పటిలానే
మరో రోజు
ఉలిక్కిపడింది
ఎన్ని లోయలు.. అగాధాలు
నీ బాధలు.. సందర్భాలు
నిన్ను వీడనున్నాయో
నీకోసం వేచి ఉన్నాయో
తేల్చుకోవడానికే
బయల్దేరాను
కాషాయం పొగలు
మింగేసిన కాలమో..
నియంతలను
కుప్పకూల్చే గాలమో..
కాలమా !
నువ్వెలా వచ్చినా..
నే సిద్ధమే
నిరాశ లేదు.
భయపడేది అసలే లేదు.
కాలానికి జంధ్యమేసే వాడెవడో..
దేశానికి ఇనుప గొలుసులేసే వాడెవడో..
తేల్చుకోవడానికే..
మనువుగాడి
అంత్యక్రియలు చేయడానికే
మతోన్మాదుల మరణశయ్యను
సిద్ధం చేయడానికే..వేచి ఉన్నాం
రండి.. అద్దంలో
ముఖం చూసుకుందాం
చరిత్రను నడిరోడ్డు మీద
నగంగా ఆరేద్దాం
నన్ను అశుద్ధుడిని చేసిన వాడా !
ఈ సమస్త మురికిని శుద్ధిచేసే
అసలు మనిషిని నేనేనని
నెత్తురోడిన ఈ మట్టి సాక్షిగా
ప్రకటిస్తున్నా -

శిఖా - ఆకాష్‌
9381522247.