Apr 23,2023 09:50
  • గంటల వ్యవధిలో 6.1, 5.8 తీవ్రతతో రెండు ప్రకంపనలు

ఇండోనేషియా : ఇండోనేషియాను ఈ తెల్లవారుజామున రెండు భారీ భూకంపాలు కుదిపేశాయి. తొలి భూకంపం కేపులాన్‌ బటులో 6.1 తీవ్రతతో సంభవించగా, ఆ తర్వాత గంటల వ్యవధిలోనే 5.8 తీవ్రతతో మరో భూకంపం సంభవించినట్లు యూరోపియన్‌ మెడిటరేనియన్‌ సీస్మోలాజికల్‌ సెంటర్‌ (ఈఎంఎస్‌సీ) తెలిపింది. తొలి భూకంపం భూమికి 43 కిలోమీటర్ల లోతున, రెండోది 40 కిలోమీటర్ల లోతున సంభవించినట్టు పేర్కొంది. అయితే, ఈ భూకంపాల వల్ల జరిగిన నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.