Jul 19,2022 09:48

విశాఖ : విశాఖ షీలానగర్‌లో సోమవారం అర్థరాత్రి దారుణం జరిగింది. అఖిలేష్‌ అనే వ్యక్తి నామాల సురేష్‌ (38) ను రాడ్‌ తో కొట్టి హత్య చేశాడు. నిందితుడు పరారయ్యాడు. ఘటనా స్థలానికి గాజువాక పోలీసులు చేరుకున్నారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణంగా తెలుస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.