
వీరవాసరం (పశ్చిమ గోదావరి) : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం వీరవాసరం జాతీయ రహదారిపై జరిగింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మఅతుడు పాలకోడేరు మండలం పెన్నాడ వద్ద వంకాయల పాలెం రైల్వే గేట్ మేన్ మరివాడ తారక రామారావుగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.