
ప్రజాశక్తి-కలకడ (రాయచోటి-అన్నమయ్య) : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... మండలంలోని కదిరాయ చెరువు పంచాయతీ వడ్డిపల్లి కు చెందిన పూజారి నడిపి రెడ్డప్ప కుమారుడు పూజారి సుబ్బరాజు (45) తన టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై తన గ్రామం వడ్డిపల్లి నుండి కదిరాయచెరువు కు వస్తున్న క్రమంలో గుర్రంకొండ వైపు నుండి వస్తున్న లారీ సుబ్బరాజు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢకొీట్టింది. లారీ డ్రైవర్ సయ్యద్ సద్దాం హుస్సేన్ అజాగ్రత్తగా, అతివేగంగా లారీని నడుపుతూ సుబ్బరాజు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢకొీనడంతో గాయాలపాలైన అతనిని తన బంధువులు కలకడ 108 వాహనంలో మదనపల్లెకు చికిత్స నిమిత్తం తరలించినట్లు తెలిపారు. 108 వాహనంలో మదనపల్లికి తీసుకుని వెళ్ళగా అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే వ్యక్తి మృతి చెందినట్లు తెలిపారని అన్నారు. సుబ్బరాజు రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలుసుకున్న ఎస్సై తన సిబ్బందితో మదనపల్లికి వెళ్లి పోస్టుమార్టంకు మృతదేహాన్ని పంపి, తరువాత సుబ్బరాజు భౌతికకాయాన్ని బంధువులకు అప్పగించారు. ఈ మేరకు మృతుడు సుబ్బరాజు చిన్నాన్న కుమారుడు రెడ్డప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.