Oct 08,2023 10:58

శివమొగ్గ / షిమోగా కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లాలోని నగరం. ఇది అదే జిల్లాకు ముఖ్యపట్టణం. ఇది తుంగ నది ఒడ్డున ఉంది. 'శివ ముఖ' (శివుని ముఖం) అనే పదం నుండి 'శివమొగ్గ' పదం వచ్చిందంటారు. 'సిహి మోగె' (తీపి కుండ) నుండి కూడా ఈ పేరు వచ్చిందంటారు. 16వ శతాబ్దంలో 'కేలడి' నాయకుల పాలనా కాలంలో ఈ పట్టణం ప్రాముఖ్యతను సంతరించుకొంది. శివప్ప నాయకుని కాలం ఈ నగరం చరిత్రలో సువర్ణఘట్టం. ఆ తర్వాత మైసూరు రాజ్యంలో భాగంగా ఉంది. అధికారికంగా 2006, నవంబరు 1న ఈ నగరం, జిల్లా పేరును 'షిమోగా' నుండి 'శివమొగ్గ' గా మార్చారు. ఈ జిల్లాకు తూర్పున దావణగెరి జిల్లా, ఆగేయాన చిక్‌మంగళూరు జిల్లా, నైరుతిన ఉడిపి జిల్లా, వాయువ్యాన ఉత్తర కన్నడ జిల్లా, ఈశాన్యాన హవేరి జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. ఈ రైలు, రవాణా మార్గాలు అందుబాటులో ఉన్నాయి. శివమొగ్గ పట్టణానికి ఆరు కి.మీ. దూరంలో సొగానె వద్ద విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు. దేశంలో ముఖ్యమైన విశ్వేశ్వరయ్య ఇనుము-ఉక్కు పరిశ్రమ ఈ జిల్లాలో ఈశాన్యాన భద్రావతి వద్ద ఉంది. శరావతిలోయ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం సాగర్‌ తాలుకాలో ఉంది.

1

 

2

 

4

 

2