Oct 15,2023 19:14

రాజేంద్ర ప్రసాద్‌, గౌతమి ప్రధాన పాత్రల్లో దర్శకుడు రాజ్‌ మదిరాజు రూపొందించిన చిత్రం 'కృష్ణారామా'. అద్వితీయ మూవీస్‌ బ్యానర్‌ పై వెంకట కిరణ్‌, కుమార్‌ కళ్లకూరి, హేమ మాధురి నిర్మించారు. ఈ సినిమా 'ఈటీవీ విన్‌'లో ఈనెల 22 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ నిర్వహించిన టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో రాజేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ,'ఇది చాలా ప్రత్యేకమైన చిత్రం. రాజ్‌ కథ చెప్పినపుడు చాలా సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది. ఇప్పటి జనరేష్‌కి తగిన కథ ఇది. సోషల్‌ మీడియా నేపథ్యంలో ఒక రిటైర్డ్‌ ఓల్డ్‌ పెయిర్‌ కోణంలో సాగే అద్భుతమైన కథ ఇది' అని తెలిపారు.
'ఇది చాలా యూనిక్‌, స్పెషల్‌ ప్రాజెక్ట్‌. ఇలాంటి చక్కని కథని రాసిన దర్శకుడు రాజ్‌కి ధన్యవాదాలు. చాలా మోడ్రన్‌ సబ్జెక్ట్‌ ఇది. నా ఫస్ట్‌ హీరో రాజేంద్ర ప్రసాద్‌తో ఈ సినిమా చేయటం ఆనందంగా ఉంది. ఈ తరం ప్రేక్షకుల్ని బాగా ఎంటర్‌టైన్‌ చేస్తుంది. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి' అని గౌతమి చెప్పారు.
దర్శకుడు రాజ్‌ మదిరాజు మాట్లాడుతూ,'కృష్ణారామా నాకు ఒక రోలర్‌ కోస్టర్‌ రైడ్‌. ఇది నా నాలుగో సినిమా. 'రిషి' తర్వాత మనసుపెట్టి రాసిన కథ ఇది. ఈటీవీ సంస్థకు ధన్యవాదాలు. రాజేంద్రప్రసాద్‌, గౌతమి వంటి హేమాహేమీలు ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. అందరికీ కనెక్ట్‌ అయ్యే రీతిలో ఉండే ట్రెండ్‌కి తగ్గ సినిమా ఇది. ఈ నెల 22 నుంచి 'ఈటీవీ విన్‌'లో ఇది ప్రసారం కానుంది' అని అన్నారు.