ప్రజాశక్తి - జీలుగుమిల్లి (ఏలూరు) : జీలుగుమిల్లి మండలంలోని దర్భగుడెం దాబా సమీపంలో జాతీయ రహదారి పై పొలం నుంచి నడుచుకుంటు వెళుతున్న భార్య, భర్తలను లారీ ఢీకొట్టిన ఘటన శనివారం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ... దర్భగూడెం గ్రామానికి చెందిన పళ్లంట్ల.నాగేశ్వరావు, భార్య లక్ష్మి ఎప్పటిలానే పొలంలో పని చేసుకొని ఇంటికి తిరిగి నడిచి వస్తుండగా, వెనక నుంచి ఐచర్ వ్యాన్ ఢీకొట్టడంతో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వారిని 108 లో జంగారెడ్డి గూడెంలోని రాజా ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఘటనకు సంబంధించి స్థానికులు రెండు వాహనాలను ఆపగా ఒక డ్రైవర్ పరారీలో ఉన్నాడని తెలిపారు..










