కటక్ (ఒడిశా) : గూడ్స్ రైలు ఇంజిన్‌పై కొండచరియలు విరిగిపడటంతో రైలు పట్టాలు తప్పిన ఘటన బుధవారం ఒడిశాలోని అంగుల్ జిల్లాలో జరిగింది. తాల్చేర్ నుంచి సంబల్‌పూర్‌కు బొగ్గులోడుతో గూడ్సు రైలు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే రైలులో ఉన్న సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. సమాచారం అందుకున్న రైల్వే ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో కొండచరియలు విరిగిపడ్డాయని తెలిపారు. రైలుమార్గంలో పడిన బండరాళ్లను తొలగించేందుకు రైల్వే సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.










