Aug 25,2023 13:22

ముంబై : దేశంలోనే పేరొందిన ఐఐటీ బాంబేకు పూర్వ విద్యార్థి ఒకరు భారీ మొత్తాన్ని విరాళంగా అందించారు. రూ.160 కోట్లకు చెక్‌ రాసి పంపించాడని ఐఐటీ బాంబే డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ సుభాసిస్‌ చౌదరి తెలిపారు. తన పేరు వెల్లడించవద్దని దాత కోరడంతో వివరాలను గోప్యంగా ఉంచాల్సి వస్తోందన్నారు. ఈ మొత్తాన్ని గ్రీన్‌ ఎనర్జీ అండ్‌ సస్టైనబిలిటీ రీసెర్చ్‌ హబ్‌ ఏర్పాటుకు వెచ్చిస్తామని వివరించారు. కాగా, ఇంత పెద్ద మొత్తంలో విరాళం అందించి కూడా ప్రచారం కోరుకోకపోవడం దాతకున్న గొప్ప మనసును చాటుతోందని ప్రశంసించారు.