May 11,2023 08:16

ముంబయి : బాంబే ఐఐటి దళిత విద్యార్థి దర్శన్‌ సోలంకి ఆత్మహత్య కేసులో నిందితుడికి ముంబయిలో ప్రత్యేక కోర్టు శనివారం బెయిల్‌ మంజారు చేసింది. ఈ బెయిల్‌ ఉత్వర్వుల సమగ్ర కాపీ బుధవారం అందుబాటులోకి వచ్చింది. సోలంకీని ఖత్రి వేధింపులకు గురి చేశాడని చెప్పడానికి సరైన ఆధారాలు లేవని ఉత్తర్వుల్లో పేర్కొంది. సూసైడ్‌ నోట్‌ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ 'దర్శన్‌ను నిందితుడు ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు చూపించడానికి ప్రత్యేకంగా ఏమీ లేదు' అని తెలిపింది. నిందితుడిన్ని దోషిగా నిర్ధారించడానికి సూసైడ్‌ నోట్‌లో ఆరోపణలు సరిపోవని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అదే ఐఐటికి చెందిన 18 ఏళ్ల అర్మాన్‌ ఖత్రికి ఈ నెల 6న అదనపు సెషన్స్‌ జడ్జి ఎపి కనడే బెయిల్‌ మంజూరు చేశారు. అహ్మదాబాద్‌కు చెందిన దళిత విద్యార్థి దర్శన్‌ ఈ ఏడాది ఫిబ్రవరి 12న బాంబే ఐఐటి హాస్టల్‌ భవనంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏప్రిల్‌ 11న దర్శన్‌ గదిలో 'అర్మాన్‌ నన్ను చంపాడు' అని ఒక లైన్‌ నోట్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం కనుగొంది.