- ముగ్గురికి తీవ్ర గాయాలు
ప్రజాశక్తి-యు.కొత్తపల్లి (కాకినాడ) : కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలో మామిడి మల్లిబాబు ఇంట్లో గురువారం గ్యాస్ బండ పేలడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 8వ తరగతి చదువుతున్న చిన్నారి మృతి చెందగా ముగ్గురుకు తీవ్ర గాయాలు కావడంతో కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం కాకినాడ జిజిహెచ్‌కు తరలించినట్లు స్థానికులు తెలిపారు ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.










