Oct 15,2023 19:30

విక్రాంత్‌, మెహరీన్‌ పిర్జాదా, రుక్సార్‌ థిల్లాన్‌ హీరో హీరోయిన్స్‌గా డెఫ్‌ ఫ్రాగ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రం 'స్పార్క్‌ లైఫ్‌'. ఈ సైకలాజికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ నవంబర్‌ 17న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా శనివారం మేకర్స్‌ ఈ చిత్రట్రైలర్‌ను విడుదల చేశారు.ఈ సందర్భంగా హీరో విక్రాంత్‌ మాట్లాడుతూ, 'ఈ మూవీ నా మూడేళ్ల కల. ట్రైలర్‌ అందరికీ నచ్చి ఉంటుందని భావిస్తున్నాను. మూవీ మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. ఇదొక మల్టీ జోనర్‌ మూవీ. యూనివర్సల్‌ అప్పీల్‌ ఉండటంతో దీన్ని పాన్‌ ఇండియా రేంజ్‌లో మల్టీపుల్‌ లాంగ్వేజెస్‌లో రిలీజ్‌ చేస్తున్నాం. హేషం అబ్దుల్‌ వహాబ్‌ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇప్పటికే రెండు పాటలు రిలీజ్‌ అయ్యాయి. ఇంకా మూడు సాంగ్స్‌ రావాల్సి ఉన్నాయి' అని అన్నారు.గురు సోమసుందరం ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో నాజర్‌, సుహాసిని మణిరత్నం, వెన్నెల కిషోర్‌, సత్య, బ్రహ్మాజీ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, చమ్మక్‌ చంద్ర, అన్నపూర్ణమ్మ, రాజా రవీంద్ర తదితరులు ఇతర పాత్రల్ని పోషిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్‌ అవుతుంది.