ప్రజాశక్తి - బి.కొత్తకోట (రాయచోటి) : గుర్తుతెలియని వాహనం ఢీకొని జింక మృతి చెందిన సంఘటన బి.కొత్తకోట పట్టణం ఇందిరమ్మ కాలనీ సమీపంలో మంగళవారం రాత్రి జరిగింది. బి.కొత్తకోట - పిటిఎం రోడ్డులో ఓ జింక మృతి చెంది రోడ్డు పక్కన పడి ఉండగా స్థానికులు గమనించి అధికారులకు సమాచారం అందించారు. అయితే వాహనదారులు వాహనాలను నిదానంగా నడపాలని, వన్యప్రాణులను రక్షించుకోవాల్సిన బాధ్యత అటవీ శాఖ అధికారులతోపాటు అందరిపైన ఉందని ప్రజలు తెలిపారు.










