ఏలూరు : గుర్తు తెలియని వాహనం ఢీకొని వంట మేస్త్రి మృతి చెందిన ఘటన గురువారం రాత్రి జంగారెడ్డిగూడెంలో తల్లాడ - దేవరపల్లి జాతీయ రహదారిపై జరిగింది. ప్రమాద స్థలాన్ని జంగారెడ్డిగూడెం సీఐ బాలా సురేష్ బాబు పరిశీలించారు. మృతుడు రుషి అనే వంట మేస్త్రిగా గుర్తించారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.










