Sep 28,2023 17:22
  •  నేటి నుంచి లోకేష్‌ యువగళం

ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్‌ : టిడిపి అధినేత, మాజీ సీఎం చంద్రబాబు స్కిల్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా అక్రమాలకు పాల్పడ్డడని తప్పుడు ప్రచారం చేస్తున్న వైసీపీ నాయకులు దీనిపై అసెంబ్లీలో అఖిలపక్ష కమిటీ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. గురువారం చిక్కాల జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీమంత్రి చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ.. టీడీపీ యువనేత లోకేష్‌ శుక్రవారం నుంచి మరల ప్రారంభించిపోతున్న యాత్ర తిరిగి ఎక్కడ ఆగిపోయిందో అక్కడ నుంచే మొదలవుతుందని తెలిపారు. చంద్రబాబు స్కిల్‌ డెవలప్మెంట్కి సంబంధించి 2021 డిసెంబర్లో అక్రమాలు చేశాడంటూ కేసు నమోదు చేశారని అప్పటినుంచి విచారణ ప్రారంభించకుండగా సుమారు 20 రోజుల క్రితం కావాలనే రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో సిఐడి పోలీసులు అక్రమంగా చేశారన్నారు. చంద్రబాబు గనుక అక్రమాలకు పాల్పడితే అసెంబ్లీ ద్వారా ప్రభుత్వం ఎందుకు అఖిల పక్ష కమిటీ వేయలేదో చెప్పాలన్నారు. చంద్రబాబు అక్రమాలకు పాల్పడలేదని అందువల్ల అసెంబ్లీ అఖిలపక్షం కమిటీ వేయలేదని చిక్కాల చెప్పారు. స్కిల్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా రాష్ట్రంలో ఆరు క్లస్టర్లలో 72 కేంద్రాల ద్వారా రెండు లక్షల 13 మంది శిక్షణ పొందారని 70 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. లోకేష్ను కూడా రింగ్‌ రోడ్‌ వ్యవహారంలో అక్రమాలు చేశాడని అతనిని కూడా అరెస్టు చేస్తారంటూ వైసీపీ వారు ప్రచారం చేస్తున్నారని, ఎటువంటి కేటాయింపులు జరగలేదని ఎలా అరెస్ట్‌ చేస్తారని చిక్కాల ప్రశ్నించారు. శుక్రవారం రాత్రి 8 గంటలకు లోకేష్‌ యువగళం పాదయాత్ర రాజోలు నియోజకవర్గం నుండి ప్రారంభం అవుతుందని దీనిని విజయవంతం చేయాలని చిక్కాల కోరారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ మద్దతుగా నిలిచిన జనసేన, వామపక్ష ఇతర రాజకీయ పార్టీల నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో టిడిపి నాయకులు దేవు వెంకన్న, రామదేవు సీతయ్య దొర, వాసిరెడ్డి చిట్టిబాబు, వాసిరెడ్డి సుబ్రహ్మణ్యం, చిక్కాల అబ్బు తదితరులు పాల్గొన్నారు.