- మరో 19 మంది ప్రయాణికులకు గాయాలు
నేపాల్ : నేపాల్‌లో గురువారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మొత్తం 26 మంది యాత్రీకులతో వెళుతున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో మొత్తం ఏడుగురు మరణించగా.. ఆరుగురు భారతీయులేనని నేపాల్ అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. యాత్రీకులను బస్సులో నుంచి బయటకు తీశారు. గాయపడిన వారిని హెటౌడలోని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించే ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై నేపాల్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన పలువురు నేపాల్‌లో తీర్థయాత్రలకు వచ్చారు. మిగతా యాత్రికులతో కలిసి గురువారం ఉదయం బస్సులో ఖాట్మాండు నుంచి జానక్ పూర్ బయలుదేరారు. జీత్‌పూర్ సిమారాలోని చురియమై ఆలయం సమీపంలో బస్సు అదుపుతప్పి.. పక్కనే ఉన్న 15 మీటర్ల లోయలో పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 26 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.