Jul 13,2023 14:30

రాజస్థాన్‌: అల్వార్‌కు చెందిన దాదాపు 10సంవత్సరాల బాలుడు మతిస్థిమితం కోల్పోయాడు. అతడి పరిస్థితి ఎలా మారిందంటే.. ఆన్‌లైన్‌ గేమ్‌ ఆడాలని పట్టుబట్టడం వల్ల చాలాసార్లు బలవంతంగా కట్టివేయాల్సి వచ్చింది. ఆ బాలుడికి అతని తల్లిదండ్రులు ఏడు నెలల క్రితం ఆండ్రాయిడ్‌ మొబైల్‌ ఫోన్‌ కొనిచ్చారు. జనవరి 2023 నుండి, అతను ఫోన్‌తో ఇంట్లోనే ఉంటాడు. తల్లిదండ్రులు ఉదయాన్నే తమ పనులకు వెళ్లేవారు. ఆ బాలుడు ఇంట్లో ఒంటరిగా ఉంటూ మొబైల్‌లో 14 నుంచి 15 గంటల పాటు ఫైర్‌ ఫ్రీ అనే మొబైల్‌ గేమ్‌ను ఆడుతుండేవాడు. గత ఆరు నెలలుగా పబ్‌జీ ఫ్రీ ఫైర్‌ ఆడుతున్న ఆ బాలుడు తీవ్రమైన మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాడు. అతను మానసిక స్థితి చాలా వరకు క్షీణించింది. చివరికి నిద్రలో కూడా గేమ్‌ ఆడుతున్నట్లు భావించడం మొదలుపెట్టాడు. మరలా ఆ బాలుడిని మామూలుగా మార్చేందుకే చికిత్సలో భాగంగా అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ, ఎటువంటి పురోగతి కనిపించలేదు. చివరికి చేసేదేమిలేక బాలుడి కుటుంబం అతన్ని అల్వార్‌ మేధో వికలాంగుల రెసిడెన్షియల్‌ స్కూల్‌లో చేర్చారు. అక్కడ అతని మానసిక స్థితిని మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడ కౌన్సెలర్లు అతనికి సహాయం చేస్తున్నారు. సైకియాట్రిస్ట్‌, ఇతర వైద్యుల బఅందం కూడా దానిపై పని చేస్తూ.. అతన్ని తిరిగి మామూలు స్థితికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.