Sep 20,2023 11:28

ప్రజాశక్తి-కొండాపురం (కడప) : ఆగి ఉన్న లారీని బైక్‌ ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందగా, అదే లారీని కారు ఢీకొట్టడంతో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున వెంకటాపురం ఏటూరు గ్రామాల మధ్య జాతీయ రహదారిపై జరిగింది.

తాళ్ల పొద్దుటూరు ఎస్సై మోహన్‌ వివరాల మేరకు ... మండలంలోని తాళ్ల పొద్దుటూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని వెంకటాపురం ఏటూరు గ్రామాల మధ్య జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున ఎర్రగుంట్ల మండలం తిప్పలూరు గ్రామానికి చెందిన హరికృష్ణ (27) అనంతపురం జిల్లాలోని తన భార్య వద్దకు మోటార్‌ బైక్‌ పై వెళుతుండగా, కొండాపురం మండలంలోని ఏటూరు, వెంకటాపురం గ్రామాల మధ్య జాతీయ రహదారి పై ఆగి ఉన్న లారీ KA01AP3222 ని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత వెనుకగా వస్తున్న మరొక కారు KA04AA 6443 ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి తాళ్ళప్రొద్దుటూరు ఎస్సై తన సిబ్బందితో కలిసి ప్రమాద స్థలానికి వెళ్లారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. యువకుడి మృతదేహాన్ని బయటకు తీసి తాడిపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై తాళ్ల పొద్దుటూరు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు