Jul 31,2023 16:19

ప్రజాశక్తి-విశాఖపట్టణం: నర్సీపట్నం మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ సుబ్బలక్ష్మి అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ సమావేశంలో తమ వార్డుల్లోని సమస్యలు పరిష్కరించాలని పలువురు కౌన్సిలర్లు కోరారు. ఈ క్రమంలో టీడీపీ కౌన్సిలర్‌ రామరాజు మాట్లాడుతూ.. మున్సిపల్‌ కౌన్సిలర్‌గా ఎన్నికైనా ప్రజల సమస్యలను పరిష్కరించడంలో తాను విఫలమైనట్టుగా ఆవేదన వ్యక్తం చేశారు. కౌన్సిలర్‌గా ఎన్నికైన 30 నెలలు అవుతున్నా తన వార్డులో మంచినీటి కుళాయిని కూడ ఏర్పాటు చేయించలేని పరిస్థితి నెలకొందని చెప్పుతో చెంపపై కొట్టుకున్నారు. ఈ సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తారని ఆయన చైర్మెన్‌ను నిలదీశారు. ఈ విషయమై చైర్మెన్‌తో వాగ్వాదానికి దిగారు. కౌన్సిలర్‌ గా తనను ఎన్నుకున్న ప్రజలకు తాను ఏం చేయలేకపోయానన్నారు. రామరాజు పక్కనే కూర్చున్న మరో కౌన్సిలర్‌ రామరాజును అడ్డుకున్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతోనే తాను కౌన్సిలర్‌గా పోటీ చేసినట్టుగా.. తన వార్డులో సమస్యలను చెప్పుకుంటూ సమావేశంలోనే చెప్పుతో తనకు తాను కొట్టుకొని నిరసన తెలిపారు.