ప్రజాశక్తి-ఉంగుటూరు (ఏలూరు) : ఖరీఫ్ ధాన్యం సేకరణలో ప్రభుత్వం సపోర్టింగ్ ఏజెన్సీలకు బాధ్యత అప్పగించినా ట్రాన్స్‌పోర్టు వాహనాలు అందుబాటులో లేకపోవడం వల్ల ధాన్యం రాశులు కల్లాల్లోనే ఉండిపోయాయి. శుక్రవారం రైతులు మాట్లాడుతూ ... ఉంగుటూరు మండలం పలు గ్రామాల్లో సుమారు 90 లారీల ధాన్యం రెడీగా ఉందని, సరైన వాహనాలను సపోర్టింగ్ ఏజెన్సీలు సకాలంలో పంపకపోవడంతో ఆందోళన చెందుతున్నామన్నారు. ధాన్యం రాశుల వద్ద రాత్రుల్లో కాపలా కాయలేక ఇబ్బంది పడుతున్నామన్నారు. లారీలను తక్షణమే పంపాలని రైతులు డిమాండ్ చేశారు.










