Aug 19,2023 15:12

ప్రజాశక్తి-తాళ్లరేవు (కాకినాడ) : జార్జిపేట పంచాయతీ సర్పంచ్‌ ఉప ఎన్నికకు సంబంధించి శనివారం నిర్వహించిన పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. పోలీసుల భారీ బందోబస్తు మధ్య పంచాయతీ పరిధిలోని 14 పోలింగ్‌ బూత్‌లలో 3,494 ఓటర్లకు గాను 2522 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 72.18 శాతం పోలింగ్‌ జరిగినట్లు పోలీంగ్‌ అధికారులు తెలిపారు. డిఎస్‌పి మురళి కృష్ణారెడ్డి పర్యవేక్షణలో సిఐలు శ్రీనివాస్‌, సుమంత్‌, కోరంగి ఎస్‌ఐ పి.శ్రీనివాస్‌ కుమార్‌ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు నిర్వహించారు. ఎంపీడీవో ఎమ్‌.అనుపమ, రిటర్నింగ్‌ అధికారి విద్యాసాగర్‌ కుమార్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి వరలక్ష్మి, సుమారు 160 మంది సిబ్బంది పాల్గొన్నారు.