Nov 19,2022 12:25

ప్రజాశక్తి-నందిగామ (ఎన్‌టిఆర్‌) : నందిగామ ఎన్‌ఫోర్సుమెంటు పరిధిలో 59 మద్యం బాటిల్స్‌ను సీజ్‌ చేసి ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు నందిగామ స్పెషల్‌ ఎన్‌ఫోర్సుమెంటు సిఐ ఎన్‌.ఇంద్రజిత్‌ తెలిపారు. ముప్పాళ్ళ గ్రామంలో పసుపులేటి శ్రీనివాసరావు వద్ద 47 మద్యం బాటిల్స్‌, హుండా యాక్టివా, మరోవైపు.. అనిగండ్లపాడు గ్రామంలోని చిల్లర కొట్టులో మువ్వా కోటేశ్వరరావు వద్ద 12 మద్యం బాటిల్స్‌ను సీజ్‌ చేసినట్టు చెప్పారు. ఈ దాడులలో ఎస్‌ఐ ఎవివి శ్రీనివాస్‌, సిబ్బంది పాల్గొన్నారు.