Nov 02,2022 17:26

నేటికాలంలో చాలామంది బ్యూటీ పార్లర్‌లలో హెయిర్‌వాష్‌ చేయించుకుంటున్నారు. ఇలా హెయిర్‌వాష్‌ చేయించుకోవడం వల్ల జుట్టు మెరవడంతోపాటు, మంచి వాసన కూడా వస్తుంది. అందుకే చిన్న చిన్న ఫంక్షన్లకైనా.. వివాహ వేడుకలకైనా.. యూత్‌ బ్యూటీ పార్లర్‌లకి వెళ్లి హెయిర్‌ వాష్‌ చేయించుకోవడానికే ఆసక్తి కనబరుస్తున్నారు. ఇలా హెయిర్‌వాష్‌ చేయించుకుంటే బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
బ్యూటీ పార్లర్‌లో.. కేవలం తలని మాత్రమే షింక్‌లో ఉంచి.. షాంపుతో హెయిర్‌ని వాష్‌ చేస్తారు. ఇలా చేయడం వల్ల.. తల సరైన విధంగా ఉండదు. పైగా మెడ నరాల నుంచి మెదడు నరాలకు జరిగే రక్తప్రసరణ సరిగ్గా జరగక బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే అవకాశముందని హైదరాబాద్‌ అపోలో హాస్పిటల్‌ న్యూరాలజిస్ట్‌ డాక్టర్‌ సుధీర్‌ కుమార్‌ అన్నారు. ఇటీవల ఓ యాభై ఏళ్ల మహిళ తరచూ బ్యూటీ పార్లర్‌లో హెయిర్‌వాష్‌ చేయించుకోవడం వల్ల.. బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చిందని ఆయన తన ట్వీట్‌ ద్వారా తెలిపారు.

  • హెయిర్‌వాష్‌ వల్ల.. మెదడుకి ఆక్సిజన్‌ అందదు. రక్తప్రసరణ ఆగిపోయి.. గడ్డలు కట్టి.. అది మిగతా శరీర అవయవాలపై ప్రభావం చూపుతుంది. ఒకరకంగా చెప్పుకోవాలంటే.. పక్షవాతానికి దారితీస్తుంది. అయితే బ్యూటీపార్లర్‌లో హెయిర్‌వాష్‌ చేయించుకోవాలనుకునేవాళ్లు.. తప్పనిసరిగా యోగా చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.