Dec 20,2022 13:17

ఇంటర్నెట్‌డెస్క్‌ : మధుమేహస్తులు కంటి చూపును పరిశీలించుకుంటున్నారా? మీరు కొద్దిపాటి నిర్లక్ష్యం వహించినా.. కంటి చూపును కోల్పోయే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు కళ్లలోని అత్యంత సున్నితమైన రక్త నాళాలకు నష్టం చేకూరుతుంది. బ్లడ్‌లో షుగర్‌ లెవల్‌ పెరిగితే.. రెటీనాకు హాని చేస్తుంది. రెటీనా దెబ్బతినడం వల్ల.. కంటిచూపు సరిగ్గా కనపడదు. లేదా శాశ్వతంగా చూపును కోల్పోయే ప్రమాదముందని వైద్యులు చెబుతున్నారు.
- డయాబెటిక్‌ ఉన్నవారిలో రెటినోపతి, గ్లాకోమా, కంటిశుక్లం వంటివి సాధారణంగా ఉంటాయి. కంటిచూపును కాపాడుకోవాలంటే.. తప్పనిసరిగా షుగర్‌ లెవల్స్‌ను పరిశీలించుకుంటూ ఉండాలి. చక్కెర స్థాయిల్ని నియంత్రణలో ఉంచుకుంటే కంటిచూపును కాపాడుకోవచ్చు.
- పొగ త్రాగే అలవాటున్న వారిలో కంటి ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినే అవకాశముంది. వైద్యుల సలహా మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ధూమపానం చేయకూడదు.
- పోషకాహారం తీసుకుంటే కంటిచూపును కాపాడుకోవచ్చు. విటమిన్‌ ఎ, సి, ఇ ఉన్న ఆహారం తీసుకోవాలి. ఆకుకూరలు, చేపలు, వాల్‌నట్స్‌, బాదం, బీన్స్‌ వంటివి ఆహారంలో భాగంగా తీసుకుంటే చక్కెర స్థాయిల్ని నియంత్రించవచ్చు.
- సంవత్సరానికి ఒకసారి తప్పనిసరిగా నేత్ర వైద్యుని వద్ద కంటిని పరీక్షించుకోవడం తప్పనిసరి.