Oct 07,2022 11:16

న్యూఢిల్లీ : దేశంలో 2020 మహమ్మారి కాలంలో మొత్తం 5.6 కోట్ల మంది భారతీయులు పేదరికంలోకి జారుకున్నారని ప్రపంచ బ్యాంకు ఒక నివేదికలో తెలిపింది. సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ నిర్వహించిన గృహ సర్వే డేటాను ఈ సందర్భంగా ఉటంకించింది. ''పేదరికం, భాగస్వామ్య శ్రేయస్సు 2022'' పేరుతో ఈ సమాచారాన్ని వెల్లడించింది. 2011 నుంచి భారత్‌ అధికారిక గణాంకాలను ప్రచురించనందున సీఎంఐఈ సర్వే నుంచి సమాచారాన్ని ఉపయోగించబడిందని ప్రపంచ బ్యాంకు తెలిపింది. 2020లో 2.3 కోట్ల మంది భారతీయులు పేదరికంలో కూరుకుపోయారని అంతర్జాతీయ ద్రవ్య నిధిలో సమర్పించిన పత్రం కంటే భారత్‌లో పేదరికంపై దాని అంచనాలు గణనీయంగా ఎక్కువగా ఉన్నాయని ఆర్థిక సంఘం పేర్కొన్నది. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర పేదరికాన్ని పెంచిందని ప్రపంచ బ్యాంకు తెలిపింది. 2019లో 8.4 శాతంగా ఉన్న పేదరికం 2020లో 9.3శాతానికి పెరిగింది. 2017లో భారత జనాభాలో 10.4శాతం మంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు. 2017లో 13.6 శాతం మంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారని అంచనా