Jul 18,2023 22:20

- పట్టణ సంస్కరణలపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వ నివేదిక
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి -అమరావతి :అదనపు నిధుల కోసం కేంద్ర ప్రభుత్వం ముడిపెట్టిన పట్టణ సంస్కరణలను ఇప్పటికే పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది.కేంద్రం సూచించిన సంస్కరణలన్నింటినీ అమలు చేస్తున్నందున అదనపు నిధులను తక్షణమే విడుదల చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికే అమలవుతున్న వివిధ రకాల సంస్కరణలను, వాటి ఫలితాలను వివరిస్తూ ఒక సుదీర్ఘ నివేదికను కేంద్రానికి పంపింది. కేంద్రం నిర్ధేశించిన లక్ష్యాలకన్నా ఎక్కువగానే పట్టణ సంస్కరణలను అమలు చేస్తున్నట్లు, ఫలితంగా రాష్ట్ర ఖజానాకు మంచి ఆదాయం వస్తున్నట్లు ఈ నివేదికలో పేర్కొంది. పట్టణాల్లో సంస్కరణలను అమలు చేస్తే అదనపు రుణాలను వడ్డీ లేకుండా ప్రోత్సాహకంగా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ప్రతిపాదించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కొద్ది రోజుల క్రితం ప్రజాశక్తి ప్రచురించింది. ఆ లేఖకు తాజాగా బదులిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సూచించిన సంస్కరణలన్నింటిని ఇప్పటికే అమలు చేస్తున్నట్లు తెలిపింది.జ ఆస్తి పన్నును 20 శాతం పెరచాలని కేంద్రం సిఫార్సు చేయగా, అరతకన్నా ఎక్కువే పెంచినట్లు రాష్ట్ర ప్రభుత్వం తన నివేదికలో పేర్కొంది. 2021-22 ఆర్థిక సంవత్సరం కన్నా 2022-23 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం చెప్పిన దానికన్నా అధికంగా ఆస్తిపన్నులో వృద్ధి సాధిరచినట్లు రాష్ట్రం పేర్కొరది. కొన్ని మున్సిపాల్టీల్లో ఏకంగా 80 శాతం కన్నా ఎక్కువ వృద్ధి ఉందని, మరికొన్ని మున్సిపాల్టీల్లో 50 శాతం కన్నా అధికంగా వృద్ధి ఉరదని పేర్కొంది. . ఇక ఐదు లక్షల జనాభా దాటిన నగరాల్లో ఈ ఆస్తి పన్ను సంస్కరణలపై దృష్టి పెట్టాలని కేంద్రం సూచిరచిగా రాష్ట్రంలో ఇటువంటి నగరాలు విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, నెల్లూరు, గురటూరు ఉరడగా, ప్రభుత్వం మాత్రం చిన్న పట్టణాలతోసహా మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఆస్తిపన్ను సంస్కరణలను అమలులోకి తీసుకువచ్చినట్లు తెలిపింది.
డిసెంబర్‌ నాటికి అరతా
ఆస్తులను గుర్తిరచేరదుకు, వసూళ్లను పూర్తి స్థాయిలో సాధిరచేరదుకు డిసెరబర్‌ 31 లక్ష్యంగా సాగుతున్నట్లు నివేదికలో ప్రభుత్వం వివరిరచిరది. దీనికోసం, వసూళ్లను పెరచేరదుకుగాను సిబ్బరదికి కూడా శిక్షణ పూర్తి చేసినట్లు వివరిరచింది. మొత్తం ఆస్తులను జిఐఎస్‌తో అనుసంధానం చేస్తూ భూమి రికార్డులను మెరుగుపరిచేరదుకు చర్యలు తీసుకురటున్నామని వివరిరచిరది. ఈ ఆస్తులను డిజిటలైజేషన్‌ చేసేరదుకు కూడా చర్యలు పూర్తి చేసినట్లు వివరిరచారు.
అన్ని బిల్లులూ ఏకీకరణ
సంస్కరణల్లో భాగంగా అన్ని బిల్లులనూ ఒకే తాటిపైకి తీసుకువస్తున్నామని ప్రభుత్వం కేంద్రానికి నివేదిరచిరది. ఆస్తి పన్ను రిజిస్టర్‌ను ఇతర విద్యుత్‌ బిల్లులు, నీటి బిల్లులు వంటి వాటితో అనుసంధానం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే నీటి బిల్లులను అనుసంధానం పూర్తి చేయగా, విద్యుత్‌ బిల్లుల అనుసంధాన ప్రక్రియ అధ్యయనంలో ఉరదని పేర్కొన్నారు. ఆస్తి పన్ను రిజిస్టర్‌ను స్టారప్స్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ, రెవెన్యూ శాఖలతో అనుసంధానం చేసే ప్రక్రియ ఇరకా చేపట్టాల్సి ఉరదని ప్రభుత్వం నివేదిరచిరది. ఆస్తి పన్నుపై స్వీయ అధ్యయనం అన్నది కూడా పాక్షికంగా పూర్తి చేసినట్లు వివరిరచిరది.
ఇకపై ఆటోమేటిక్‌ బిల్లులు
ఆస్తి పన్నుపై బిల్లులు ఇకపై డిజిటల్‌ బిల్లులుగా రానున్నాయి. ఈ బిల్లులను ఆన్‌లైన్‌లో అనుసంధానం చేయడం ద్వారా యజమానులకు నేరుగా బిల్లులు చేరుకోవడం, ఆన్‌లైన్‌లోనే వసూళ్లు చేయడం జరుగుతురదని కేంద్రానికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. ఆస్తి పన్ను ధరలను పెరచేరదుకు కేంద్రం 2024 జనవరి వరకు గడువుగా నిర్దేశిరచగా, ఆ సంస్కరణలను తాము పూర్తి చేసినట్లు రాష్ట్రం నివేదిరచిరది.
ప్రత్యేక నిధిపైనా సిద్ధం
రిరగ్‌ ఫెన్సిరగ్‌ విదానంలో ఆస్తి పన్నును అమృత్‌ నగరాల్లో, అమృత్‌ నగరాల జాబితాలో లేని పట్టణాల్లో కూడా 10 శాతం నిధులను ప్రత్యేక ఖాతాలో జమచేసి, ఆ స్థానిక సంస్థలు తీసుకునే రుణాలను భవిష్యత్తులో తీర్చేరదుకు చర్యలు తీసుకోవాలన్న కేంద్రం సిఫార్సులను కూడా త్వరలోనే అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇలా కేంద్రం పేర్కొన్న పలు అరశాలతో కూడిన రోడ్‌ మ్యాప్‌లను తాము తూచ అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొరటూ కేంద్రం చెప్పిన ప్రోత్సాహకాలను విడుదల చేయాలని నివేదికలో కోరారు.