Apr 03,2023 21:17

న్యూఢిల్లీ : గడిచిన ఆర్థిక సంవత్సరం (2022-23)లో కియా ఇండియా అమ్మకాలు 44 శాతం వృద్థితో 2,69, 229 యూనిట్లకు చేరాయని ఆ సంస్థ తెలిపింది. క్రితం మార్చితో ముగిసిన త్రైమాసికంలో 24.4 శాతం పెరుగుదలతో 74,735 యూనిట్లను విక్రయించడం ద్వారా వాహన మార్కెట్‌లో 7.4 శాతం మార్కెట్‌ వాటాను పొందినట్లు పేర్కొంది. ఇదే సమయంలో ఎగుమతుల్లో 24 శాతం వృద్థిని కనబర్చినట్లు తెలిపింది.