Oct 20,2023 17:16

జమ్మూ : జమ్మూలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు బ్రిడ్జి డివైడర్‌ని ఢకొీట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జమ్మూ- శ్రీనగర్‌ నేషనల్‌ హైవేపై ఉన్న బ్రిడ్జి డివైడర్‌ని ట్రక్కు ఢకొీట్టింది. ఈ ఘటన శుక్రవారం ఝజ్జర్‌కోట్లి వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌, కండక్టర్‌తోపాటు మరో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.