May 31,2023 12:33

ప్రజాశక్తి - నందిగామ :  నందిగామ కాకతీయ హెల్త్ క్లబ్ సిమ్మింగ్ అకాడమి ఈనెల  27-28 తేదీలలో  ఎస్ బి కె ఎఫ్ 8వ జాతీయ ఛాంపియన్షిప్  2023  న్యూఢిల్లీలో నిర్వహించారు. ఈ జాతీయ స్థాయి పోటీల్లో నందిగామకు చెందిన (స్థానిక బాలాజీ ఫ్యాన్ స్టోర్ నిర్వాహకుడు) వి సురేష్ కుమార్  సీనియర్ కేటగిరి ఫ్రీ స్టైల్ సిమ్మింగ్ 25 మీటర్స్ ఈవెంట్ నందు ద్వితీయ స్థానం సాధించారు. కాకతీయ హెల్త్ క్లబ్ నందు గత ఆరు నెలలుగా శిక్షణ పొందుతూ జాతీయస్థాయిలో ద్వితీయ స్థానంలో వచ్చినందుకు కాకతీయ హెల్త్ క్లబ్ స్విమ్మింగ్ అకాడమీ డైరెక్టర్ కాపా కార్తికేయ , కాకతీయ-అపోలో విద్యాసంస్థల చైర్మన్ కాపా రవీంద్ర నాథ్‌ సిమ్మింగ్ అకాడమీ శిక్షణ నిర్వాహకుడు గోపీచంద్‍ను హెల్త్ క్లబ్ గ్రూప్ సభ్యులందరూ అభినందనలు తెలియజేశారు. ఇందులో భాగంగా నందిగామ కాకతీయ హెల్త్ క్లబ్ స్విమ్మింగ్ అకాడమీ నందు నందిగామ ప్రాంతాల నుండి శిక్షణ పొందుతున్న, పొందబోతున్న అందరిని జాతీయస్థాయిలో, రాష్ట్రస్థాయిలో శిక్షణ ఇవ్వటమే కాకతీయ హెల్త్ క్లబ్ యొక్క ముఖ్య ఉద్దేశం అని కాకతీయ అపోలో విద్యాసంస్థల అధినేత కాపా రవీంద్రనాథ్ పేర్కొన్నారు.