Oct 08,2023 15:46

ప్రజాశక్తి-ఏలేశ్వరం(కాకినాడ) : మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ నిరసిస్తూ ప్రతిపాడులో 27వ రోజున మహిళలు నిరసన దీక్షలో పాల్గొన్నారు. నియోజకవర్గ నాలుమూలల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలకు ఈ దీక్షలో పాల్గొన్నారు. తొలుత నియోజకవర్గ ఇన్చార్జ్‌ వరుపుల సత్యప్రభ నల్ల కండువాలు వేశారు. ఈ శిబిరానికి పలువురు సంఘీభావం తెలిపారు.