చెన్నై : తమిళనాడుకు చెందిన 27 మంది భారత జాలర్లను శ్రీలంక నేవీ సిబ్బంది అరెస్టు చేశారు. అరెస్టయిన వారంతా రామేశ్వరం, తంగచైమడం ప్రాంతాలకు చెందినవారు. వీరికి చెందిన ఐదు మెకనైజ్డ్ బోట్లను కూడా శ్రీలంక నేవీ స్వాధీనం చేసుకుంది. ఈ నెల 14న పాల్క్ బే వెంబడి చేపల వేటలో నిమగమై ఉండగా వీరిని శ్రీలంక అరెస్టు చేసింది. అరెస్టు చేసిన వారిని శ్రీలంకలోని మన్నార్, కంకేసంతురై ఓడరేవులకు తరలించారు. ఈ అరెస్టు వార్త తెలిసిన తమిళనాడులోని తీర ప్రాంత జాలర్లు, ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. తమవారిని ఆదుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. అరెస్టులను ఖండిస్తూ ఆదివారం నుంచి రామేశ్వరం జాలర్లు నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నారు.










