Nov 24,2020 01:27

సమావేశంలో మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌ వేణుగోపాలరెడ్డి

విశాఖపట్నం : విశాఖపట్నం ఫిషింగ్‌ హార్బర్‌ను రూ.100 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు సంయుక్త కలెక్టర్‌ ఎం.వేణుగోపాలరెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో ఫిషింగ్‌ హార్బర్‌ హై లెవెల్‌ మేనేజింగ్‌ కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ, ఫిషింగ్‌ హార్బర్‌లో మౌలిక వసతుల అభివృద్ధి, ప్రహరీ నిర్మాణం, అదనంగా మరో రెండు హాల్లు నిర్మాణం, సీసీ కెమెరాల ఏర్పాటు, ఐస్‌ క్రషింగ్‌ మిషన్‌, సోలార్‌ విద్యుత్‌ దీపాలు జట్టీల మరమ్మతులు చేపట్టేందుకు డీపీఆర్‌ సిద్ధం చేసినట్లు తెలిపారు.