ప్రజాశక్తి-గణపవరం (ఏలూరుజిల్లా) : గణపవరం మండల ప్రజానీకానికి స్వచ్ఛమైన నీరు అందించడానికి వీలుగా 25 కోట్లతో జల జీవన పథకంలో ప్రజలకు త్రాగునీరు అందించడానికి పనులు చేపట్టినట్లు ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం 25 లక్షలుతో నిర్మాణం చేసిన మండల పరిషత్తు సమావేశము నూతన మందిరాన్ని ఆయన ప్రారంభించారు. మండల పరిషత్ అధ్యక్షులు దండు వెంకటరామరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్య మాట్లాడుతూ.. మండలంలో ప్రజలకి స్వచ్ఛమైన నీరు జల జీవన పథకం ద్వారా అందించనున్నట్లు తెలిపారు. మండలంలో శివారు గ్రామంగా ఉన్న ఎస్.కొండేపాడు గ్రామానికి యాబైలక్షల రుపాయాలు మంచినీటి కోసం అందించినట్లు తెలిపారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నవరత్నాలు ద్వారా ప్రజాసంక్షేమ పదకాలు ప్రజలకు అందిస్తుందని అన్నారు. అనంతరం సమావేశంలో. మాజీ మంత్రి వట్టి.వసంతకుమార్ సంతాపం ప్రకటించారు. అనంతరం మండలంలో ఉత్తమ అవార్డులందుకున్న గణపవరం ఎంపిడివో జి.జ్యోతిర్మయిను వ్వవసాయాధికారి వై.ప్రసాద్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి.దండువెంకటరామరాజు ఎంఈఓ పి.శేషు తహశీల్దార్ కృష్ణస్వామి జెడ్పిటిసి దేవవరపు సోమలక్షీ, అద్యక్షరాలు చనుమూరి.లక్షిబావాని, మండల పరిషత్ ఉపాద్యక్షులు సలాది.రత్నకుమారి, వైసిపి కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.










