Aug 27,2023 13:21

ప్రజాశక్తి-మార్కాపురం (ప్రకాశం) : నేషనల్‌ స్పోర్ట్స్‌ డే సందర్భంగా ఈనెల 21వ తేదీ నుండి 29వ తేదీ వరకు తపాలా సిబ్బందికి క్రీడలు నిర్వహిస్తున్నట్లు మార్కాపురం డివిజన్‌ తపాల సూపర్డెంట్‌ కే శ్రీనివాస్‌ తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక తపాలా కార్యాలయం నుండి 5కే వాక్‌, 3కే రన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పోస్టల్‌ సూపర్డెంట్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. తపాలా ఉద్యోగులల్లో ఉత్సాహాన్ని కలిగించి, వారు ఉల్లాసంగా పనిచేయడం కొరకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. స్పోర్ట్స్‌ డే వారోత్సవాల సందర్భంగా క్యారమ్స్‌, చెస్సు, బ్యాట్మెంటన్‌, క్రికెట్‌ తదితర కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ సుపరింట్డెంట్‌ మదనమోహన్‌, పోస్టు మాస్టర్‌ సయ్యద్‌ సుభాని, పోస్టల్‌ సిబ్బంది పాల్గొన్నారు.