Jun 18,2023 14:25

ప్రజాశక్తి - పెద్దాపురం : పెద్దాపురం మండలం మరలావ గ్రామంలో ఆదివారం ఎస్ ఈ బి సి ఐ కె.వి స్వామి ఆధ్వర్యంలో సారా బట్టీలపై నిర్వహించిన దాడుల్లో సారా తయారీకి సిద్ధంగా ఉంచిన 200 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసినట్లు ఎస్ ఈ బి ఎస్ ఐ వై నాగేంద్ర కృష్ణ తెలిపారు. దీనికి సంబంధించి ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశామన్నారు.ఈ సందర్భంగా గ్రామంలో సారా అనర్ధాలపై ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. ఈ దాడుల్లో ఎస్ ఈ బీ సిబ్బంది పాల్గొన్నారు