Sep 11,2023 22:13

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మా ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఇఎపిసెట్‌)-2023 ఎంపిసి అభ్యర్థుల తుది దశ అడ్మిషన్ల కౌన్సిలింగ్‌ ఈనెల 14 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి వై నజీర్‌ అహ్మద్‌ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కౌన్సిలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు ఈ నెల 14 నుంచి షవ్‌ర.aజూరషష్ట్రవ.aజూ.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఆగస్టు 23వ తేదీతో ముగిసిన తొలిదశ కౌన్సిలింగ్‌లో 94,580 సీట్లు భర్తీ అయ్యాయి. 26,276 సీట్లు భర్తీ కాలేదు.