Mar 24,2023 15:08

ప్రజాశక్తి-చందర్లపాడు : నేటి విద్యార్థులకు యువతకు భగత్ సింగ్ జీవితం స్ఫూర్తిదాయకంమని ఆయన ఆశయాలు కొనసాగించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ నందిగామ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో భగత్ సింగ్,రాజ్ గురు,సుకుదేవ్ ల 92వ వర్ధంతి కార్యక్రమం చందర్లపాడు జిల్లా పరిషత్ హైస్కూల్ లో కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భగత్ సింగ్ చిత్రపటముకు చందర్లపాడు హైస్కూల్ సుధాకర్ గోపి నాయక్ పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి చనుమోలు సైదులు,ఎస్ఎఫ్ఐ నందిగామ డివిజన్ కార్యదర్శి గోపి నాయక్ మాట్లాడుతూ బ్రిటీష్ సామ్రాజ్యావాదానికి వ్యతిరేకంగా, దేశస్వాతంత్య్ర కోసం నూనూగు మీసాల  వయస్సులోనే  ప్రాణత్యాగం చేసిన వీరకిశోరాలన్నారు. జలియన్ వాలా బాగ్ దురంతంతో ప్రభావితమైన ఆయన జీవితం దేశ స్వాతంత్య్రం కోసం పార్లమెంట్ పొగ బాంబులతో దాడి చేసి బ్రిటీష్ వారిని గడగడ లాడించిన పోరాట యోధుడు భగత్ సింగ్ అని అన్నారు. నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలకు, కాషాయకరణ, యుద్ధోన్మాదంకి వ్యతిరేకంగా పోరాడాలని, కార్పొరేట్ అనుకూల జాతీయ విద్యావిధానాన్ని రద్దు చేసేంత వరకు,విద్యా ఉపాధి అవకాశాల కోసం భగత్ సింగ్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని పోరాడాలని యువతని  కోరారు. ఈ కార్యక్రమంలో చందర్లపాడు సిఐటియు మండల కార్యదర్శి వేల్పుల ఏసోబు, ఎస్ఎఫ్ఐ నాయకులు వెంకటేష్, SKహసేన్,నాయకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.