ప్రజాశక్తి - రెడ్డిగూడెం(ఎన్టీఆర్) : ఈ నెల మూడో తేదీ నుంచి ప్రారంభం కానున్న పదోతరగతి పరీక్షలకు రెడ్డిగూడెం మండలంలో మూడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు ఏర్పాటు చేసినట్లు మండల విద్యాశాఖాధికారి పి రఘురాం తెలిపారు. పరీక్ష కేంద్రాల తనిఖీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్డిగూడెం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 160 మంది, రంగాపురం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాలయంలో 150 మంది, కస్తూరిబా గాంధీ విద్యాలయంలో 150 మంది మొత్తం 460 విద్యార్థులు పరీక్షలు వ్రాస్తున్నారని తెలిపారు. వీరిలో బాలురు 241 మంది బాలికలు 219 మంది అని ఆయన తెలిపారు. పరీక్ష సమయం ఉదయం 9:30 నిమిషాల నుండి మధ్యాహ్నం 12:45 నిమిషాల వరకు జరుగుతుందని కూడా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల మూడో తేదీ నుంచి 18 వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షలు ముగ్గురు ఛీప్ సూపరింటెండెంట్ లు, ముగ్గురు డిపార్టుమెంటల్ ఆఫర్ లు, 36 మంది ఇన్విజిలేటర్ల పర్యవేక్షణ లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.










